Naga Shaurya: అమ్మాయిని కొడతావా?.. యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం.. వీడియో వైరల్‌

నాగశౌర్య ఓ రోడ్డుపై యువకుణ్ని నిలదీసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన చర్యను పలువురు నెటిజన్లు సమర్థిస్తున్నారు.

Published : 01 Mar 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌ అంటూ ఓ యువకుడిపై హీరో నాగశౌర్య (Naga Shaurya) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలంటూ సదరు కుర్రాడిని నిలదీశారు. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టత లేదుగానీ సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈమె నా లవర్‌’ అంటూ యువకుడు చెబుతుంటే.. అయితే సారీ చెప్పు, రోడ్డుపై ఆమెను ఎందుకు కొట్టావ్‌? అని శౌర్య ప్రశ్నించిన దృశ్యాలు అందులో కనిపించాయి. అదే రహదారిపై ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులు సైతం సారీ చెప్పాలంటూ ఆ యువకుణ్ని పట్టుబట్టారు. కొందరు నెటిజన్లు, అభిమానులు నాగశౌర్య చేసిన పనిని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘కృష్ణ వ్రింద విహారి’తో గతేడాది ప్రేక్షకులను అలరించిన శౌర్య ఈ మార్చి 17న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో సందడి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని