Naga Shaurya: ‘రంగబలి’ వస్తోంది

నాగశౌర్య కథానాయకుడిగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Updated : 12 May 2023 12:58 IST

నాగశౌర్య కథానాయకుడిగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన నాగశౌర్య కొత్త లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో శౌర్య ట్రెండీ లుక్‌లో చుట్టూ ఉన్న వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. హీరోయిన్‌, ఇతర వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: పవన్‌ సి.హెచ్‌, ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని