Naga Shaurya: నాగశౌర్య పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్‌..

నటుడు నాగశౌర్య పెళ్లి పనులు షురూ అయ్యాయి. శనివారం సాయంత్రం హల్దీ వేడుకలు జరిగాయి.

Updated : 20 Nov 2022 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగశౌర్య (Naga Shaurya) పెళ్లి నేడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో ఆదివారం మధ్యాహ్నం అతడు మూడుముళ్లు వేయనున్నాడు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ వేదిక కానుంది. నిన్న హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్‌టైల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో తనకు కాబోయే సతీమణి వేలికి శౌర్య ఉంగరాన్ని తొడిగారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన  ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని