Naga Shaurya: ఇండస్ట్రీలోకి రావడం కాదు.. ఉండటం కష్టం: నాగశౌర్య

‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగశౌర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందు, రష్మి జంటగా నటించిన చిత్రమిది.

Published : 03 Nov 2022 01:12 IST

హైదరాబాద్‌: చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని, ఇండస్ట్రీలోకి వచ్చి ఉండడమే  కష్టమని యువ నటుడు నాగశౌర్య (Naga Shaurya) అన్నారు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma BlockBuster) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. నందు (Nandu), రష్మి (Rashmi Gautam) జంటగా దర్శకుడు రాజ్‌ విరాట్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు శౌర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విరాట్‌ కోహ్లీ సిక్స్‌ కొట్టి టీమిండియాను ఎలా గెలిపించారో.. ఆ పేరున్న మీరూ (దర్శకుడు) ఈ చిత్రంతో హిట్‌ కొడతారనుకుంటున్నా. అసలైన కష్టం ఇప్పుడే (సినిమా విడుదల సమయం సమీపిస్తున్నప్పుడు) మొదలవుతుంది. ఇండస్ట్రీలోకి రావడం పెద్ద కష్టంకాదు.. కానీ వచ్చి ఉండటమే కష్టం. ఈ విషయంలో మీరు (దర్శకుడిని ఉద్దేశిస్తూ) నందు నుంచి చాలా నేర్చుకోవాలి. ఈ సినిమా ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. టీమ్‌ ఎంత కసిగా పనిచేశారో తెలుస్తోంది. ప్రేక్షకులకు నేనూ నందు తెలియకపోవొచ్చేమోకానీ రష్మి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తాను ప్రచారం చేసింది. సినిమాను అంతగా ప్రేమిస్తుందామె. తనేకాదు మా అందరికీ నటన తప్ప ఇంకేం తెలియదు. నేను 2007 చివరిలో పరిశ్రమలోకి వచ్చా. అప్పటికే నందు హీరో. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఓపికగా ఉన్నాడు. బ్లాక్‌బస్టర్‌ కోసం చూస్తున్నాడు. అది ఈ సినిమాతో సాధిస్తాడని కోరుకుంటున్నా. నా సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నవ్వు వస్తావ్‌. ఆ స్థాయికి వెళ్తావనే నమ్మకం ఉంది’’ అని నాగశౌర్య అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని