Naga Shaurya: నాగశౌర్య ‘వివాహ భోజనంబు’.. ఏర్పాట్లు చూస్తే వావ్‌ అనాల్సిందే!

నాగశౌర్య వివాహ భోజన ఏర్పాట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. విభిన్న తరహాలో టేబుల్స్‌ అరేంజ్‌ చేయడం ఆకట్టుకుంది.

Published : 21 Nov 2022 02:33 IST

బెంగళూరు: ఎవరైనా సెలబ్రిటీ వివాహం చేసుకోబోతున్నారనే విషయం తెలియడమే ఆలస్యం చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఎవరిని? ఎప్పుడు? ఎక్కడ? చేసుకుంటున్నారంటూ ఆరా తీస్తుంటారు. వివాహమైందంటే.. ఎంతమంది అతిథులు వెళ్లారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయ్‌? అనే వాటికి సమాధానం కోసం వెతుకుతుంటారు. నటుడు నాగశౌర్య (Naga Shaurya) పెళ్లి విషయంలోనూ ఇదే పరిస్థితి. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన ఆదివారం వివాహమాడారు. నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సంబంధిత దృశ్యాలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా,  భోజనం కోసం చేసిన ఏర్పాట్లను అద్వితీయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ తరహా పంక్తి భోజనం చూసి చాలా కాలమైంది’ అని పలువురు చెబుతున్నారు. ఒక్కో అతిథికి ఒక్కో టేబుల్‌ను అరేంజ్‌ చేయటం, వడ్డించే వారు పంచెను ధరించడం.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ అయ్యాయి. వాటిని మీరూ చేసేయండి..




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని