Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై నాగబాబు స్పష్టత

తన తనయుడు, నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) వివాహంపై స్పందించారు నాగబాబు (Naga Babu). వరుణ్‌ త్వరలోనే సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నాడని చెప్పారు.

Updated : 01 Feb 2023 10:30 IST

హైదరాబాద్‌: మెగా నివాసంలో (Mega Family) పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి నాగబాబు (Naga Babu) స్వయంగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబును.. ‘వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఎప్పుడు?’ అని విలేకరి ప్రశ్నించగా..

‘‘వరుణ్‌ తేజ్‌ పెళ్లి త్వరలోనే ఉంటుంది. వరుణ్‌ ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు అనే విషయంపై నేను ఇప్పుడే కామెంట్ చేయను. త్వరలోనే తనకు కాబోయే భార్య గురించి తనే స్వయంగా వెల్లడిస్తాడు. పిల్లలను కంట్రోల్‌ చేయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకే నేనూ-నా సతీమణి ఓచోట.. వరుణ్‌ విడిగా ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే’’ అని నాగబాబు తెలిపారు. అనంతరం ఆయన మెగా వర్సెస్‌ అల్లు అంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని.. తామంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు