Nagababu: రామ్ చరణ్‌కు ఒక సక్సెస్ దూరం చేశాననే బాధ ఇప్పుడు తీరిపోయింది: నాగబాబు
‘ఆరెంజ్’ (orange) మూవీ రీ రిలీజ్‌పై నాగబాబు స్పందించారు. ఈ సూపర్ సక్సెస్ చరణ్ వల్లే సాధ్యమైందని అన్నారు.
హైదరాబాద్: రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నాగబాబు నిర్మించిన సినిమా ‘ఆరెంజ్’ (orange). 2010లో విడుదలైన ఆ సినిమా మ్యూజికల్‌గా హిట్టైనా .. ఆర్థికంగా విజయం సాధించలేకపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీ రిలీజ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చి థియేటర్ల వద్ద ఆరెంజ్ పాటలు, డైలాగులతో సందడి చేశారు. తాజాగా ఈ సూపర్ సక్సెస్‌పై నాగబాబు మాట్లాడారు. ట్విటర్ వేదికగా ఆయన వీడియో రిలీజ్ చేశారు.
‘ఆరెంజ్’ సినిమాను ఉద్దేశించి నాగబాబు (Nagababu) మాట్లాడుతూ.. ‘‘చిరుత’, మగధీర వంటి రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత రామ్ చరణ్‌కు ఫ్లాప్ సినిమా ఇచ్చానని ఈరోజు వరకూ బాధపడ్డాను. చరణ్ పుట్టినరోజుకు ఈ సినిమాను రీ రిలీజ్ చెయ్యమంటే చాలా ఆలోచించాను. అయితే, రామ్ చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ రావడం నాలో ఉత్సాహాన్ని నింపింది. ఈ బర్త్‌డేకి చరణ్ కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి ‘ఆరెంజ్’ను రీ రిలీజ్ చేస్తే బాగుంటుందనిపించింది. ఇప్పుడు దీనికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాకు ఇంతమంది అభిమానులున్నారా అని మేమంతా అనుకున్నాం. 13 ఏళ్ల క్రితం ప్రేక్షకులకు ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చలేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌కు ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అయింది. అందుకే ఇప్పుడు దీనికి పెద్ద మూవీకి వచ్చినన్ని కలెక్షన్స్ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్‌కు నావల్ల ఓ ప్లాప్ వచ్చింది అనే బాధ ఇప్పుడు పోయింది. ఈ సినిమా కూడా చరణ్ హిట్‌లలో ఒకటిగా పరిగణించవచ్చు అనిపించింది. చరణ్ కెరీర్‌లో నావల్ల ఒక సక్సెస్ దూరమైందన్న గాయం ఈరోజుతో మానిపోయింది. ఇదంతా చరణ్ వల్లే సాధ్యమైంది’’ అంటూ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ganesh Nimajjanam: ఘనంగా నిమజ్జనోత్సవం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు