బ్రేక్‌ ఇవ్వడానికి నేను రెడీ: నాగబాబు

తన మనుసు దోచిన ఓ నెటిజన్‌కు బ్రేక్‌ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని నటుడు నాగబాబు అన్నారు. గత కొంతకాలం నుంచి సోషల్‌మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోన్న నాగబాబు...

Published : 17 Mar 2021 15:10 IST

హైదరాబాద్‌: తన మనుసు దోచిన ఓ నెటిజన్‌కు బ్రేక్‌ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని నటుడు నాగబాబు అన్నారు. గత కొంతకాలం నుంచి సోషల్‌మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోన్న నాగబాబు తాజాగా ఇన్‌స్టాలో వచ్చిన ఓ వీడియోకి ఫిదా అయ్యారు. ‘లెజండ్‌’, ‘అరవింద సమేత’, ‘బాహుబలి’, ‘మగధీర’ చిత్రాల్లోని యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన ఈ వీడియో తనకి ఎంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘ఈ ఎడిటర్‌ ఎవరో నాకు వ్యక్తిగతంగా మెస్సేజ్‌ చేస్తే.. బ్రేక్‌ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక, వృత్తిపరమైన జీవితం విషయానికి వస్తే.. ఓ కామెడీ షోకు న్యాయనిర్ణేతగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2019లో విడుదలైన ‘ఏబీసీడీ’ అనే తెలుగు చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఏ ఇతర సినిమాలో నటించలేదు. మరోవైపు, ఈ మధ్యకాలంలో పెయింటింగ్స్‌తోనూ ఆయన నెటిజన్లను ఆకర్షిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని