Naga babu: ఆ మేధావులకు ఇదే సమాధానం.. సినీ విమర్శకులపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
సినీ నటుడు, నిర్మాత నాగబాబు(Naga babu) సినీ విమర్శకులపై ఫైర్ అయ్యారు. వారిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వరస ట్వీట్లు చేశారు.
హైదరాబాద్: సినీ విమర్శకులపై నటుడు, నిర్మాత నాగబాబు(Naga babu) ఘాటుగా స్పందించారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ తన సోషల్‌మీడియా ఖాతాలో వరస ట్వీట్లు చేశారు. సినిమాల వల్ల ప్రేక్షకులకు నష్టం కలుగుతుందని, సమాజంలో చెడు పెరగడానికి సినిమాలే కారణమని విమర్శించే(movie critics) వారికి తన ట్వీట్లతో సమాధానం చెప్పారు.
‘‘సినిమాల్లో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే.. మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. సినిమాలు కేవలం వినోదం కోసమే కానీ, జనాన్ని బాగు చెయ్యడం కోసమో చెడగొట్టడానికో కాదు. అలా సినిమాలు తీసేంత గొప్పవాళ్లు లేరిక్కడ. నేను ఓ నిర్మాతగా చెబుతున్నాను.. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది నా సమాధానం. సినిమాల్లో ఏదైనా అతిగా ఉంటే దానికి సెన్సార్ (censor) ఉంది. కుహనా మేధావుల్లారా మీరు ఏడవకండి’’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ ప్రియులు నాగబాబుకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన నిర్మాతగా రుద్రవీణ, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, ఆరెంజ్ వంటి సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగబాబు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్లో ఉంది: లోకేశ్