నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌

తన ముద్దుల కుమార్తె నిహారికకు ఘనంగా పెళ్లి చేసిన ఆనందంలో ఉన్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఐదు రోజులపాటు జరిగిన నిహారిక-చైతన్యల పెళ్లి వీడియోలను సైతం నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన పనుల్లో బిజీగా...

Updated : 24 Jan 2021 12:01 IST

నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తన ముద్దుల కుమార్తె నిహారికకు ఘనంగా పెళ్లి చేసిన ఆనందంలో ఉన్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఐదు రోజులపాటు జరిగిన నిహారిక-చైతన్యల పెళ్లి వీడియోలను సైతం నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉంటున్న నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకే ఆడవాళ్లపై నాకు ఎక్కువ గౌరవం. వరుణ్‌బాబు పుట్టిన తర్వాత ఒక కూతురు పుడితే బాగుండని అనుకున్నాను. అలాగే మాకు నిహారిక జన్మించింది. నిహారిక అంటే నాకెంతో ఇష్టం. తను నాకో బెస్ట్‌ ఫ్రెండ్. నాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆమెతోనే పంచుకుంటాను. మాఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే, పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ తను జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.’

‘నిహారిక ఎక్కడైనా సరే ఎక్కువగా అల్లరి చేస్తుంటుంది. కానీ, వరుణ్‌బాబు అలా కాదు ఇంట్లో, కొంతమంది బెస్ట్‌ ఫ్రెండ్స్‌ దగ్గర మాత్రమే ఓపెన్‌గా ఉంటాడు. పబ్లిక్‌లోకి వెళితే చాలా సైలెంట్‌. ఇక వరుణ్‌ పెళ్లి విషయానికి వస్తే.. ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది కాదు.. మేము ముఖ్యంగా కోరుకునేది మాత్రం పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు రావాలని. కాబట్టి వరుణ్‌బాబుకు ఏ విధంగానైనా (ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్లి) సరే అర్థం చేసుకునే మంచి అర్ధాంగి రావాలని కోరుకుంటున్నాను’ అని నాగబాబు వివరించారు.

ఇదీ చదవండి

పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని