హీరాబెన్‌ మోదీ గొప్ప మహిళ: నాగబాబు

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదని నటుడు నాగబాబు అన్నారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ఆయన గత కొన్నిరోజులుగా ‘పేరెంటల్‌ స్కిల్స్‌’ అంశంపై సంభాషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన వీడియోలో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో...

Updated : 09 Sep 2022 11:26 IST

హైదరాబాద్‌: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదని నటుడు నాగబాబు అన్నారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ఆయన గత కొన్నిరోజులుగా ‘పేరెంటల్‌ స్కిల్స్‌’ అంశంపై మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన వీడియోలో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు.

‘‘తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని నిరుత్సాహపరచకూడదు. వాళ్లు చేసేది చిన్న పనైనా ప్రోత్సహించాలి. మనం అలా చేస్తే భవిష్యత్తులో వాళ్లు ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఒకవేళ పిల్లలు చేసే ప్రతి పనినీ తల్లిదండ్రులు నిరుత్సాహపరిస్తే.. కొన్నిసార్లు వాళ్లు ఏ పనీ చేయడానికి ఆసక్తి చూపరు. ‘అమ్మవాళ్లు ఎప్పుడూ మనల్ని ప్రోత్సహించరు’ అనే భావన వాళ్లలో కలుగుతుంది’’

‘‘నా పిల్లల విషయానికి వస్తే.. నిహారిక చిన్న పని చేసినా సరే.. ‘బాగా చేశావమ్మ’ అంటాను. నాకు తెలుసు అది చిన్నపనే అని. కానీ, తనని నిరుత్సాహపరచడం నాకిష్టం లేదు. అలాగే, తను ఏదైనా ఆలోచనతో నా దగ్గరకి వస్తే.. ‘ఓకే అమ్మ.. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు’ అని చెప్పేవాడిని. నా మనసులో ఎక్కడో ఒక చోట ఎలా చేస్తుందో? ఏం సాధిస్తుందో? అనే అపనమ్మకం ఉన్నప్పటికీ దాన్ని పిల్లలపై రుద్దేవాడిని కాదు’’

‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్‌ అవ్వాలని రూల్ లేదు. వరుణ్‌ తేజ్‌ హీరో అవుతానన్నప్పుడు.. ‘ఓకే బాబు. ఏదైనా సరే.. గట్టి నమ్మకంతో ప్రయత్నించు‌’ అని చెప్పా. నిజం చెప్పాలంటే, వరుణ్‌బాబుని హీరో చేయాలనుకోలేదు. ఓ పోలీస్‌గా చూడాలనుకున్నా. అలాగే నిహారికను డాక్టర్‌ చేయాలనుకున్నా. అది కేవలం నా కోరిక మాత్రమే. నా అభిప్రాయాన్ని ఏ రోజూ పిల్లలపై రుద్దలేదు. నిహారిక, వరుణ్‌ బాబు ఎప్పుడూ నా మాటకు గౌరవమిస్తారు. ఏం చెప్పినా వింటారు. అలాగే, నేనూ వాళ్ల మాటలను గౌరవిస్తాను. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అలానే పెంచారు’’

‘‘ఇప్పుడు మనందరం చెప్పుకునే పోరాటయోధులందర్నీ.. వారి తల్లిదండ్రులు గొప్పగా పెంచారనేది నా భావన. ప్రస్తుతం మనందరం చూసుకుంటే.. ఓ టీ కొట్టులో పనిచేసిన నరేంద్రమోదీ గారు దేశ ప్రధాని అయ్యారు. ఇప్పటికీ ఆయన.. తన తల్లిని(హీరాబెన్‌) కలిసి వస్తుంటారు. ఆమెకి ఇలాంటి పేరెంటల్‌ స్కిల్స్‌పై ఎలాంటి ఆలోచన ఉందనేది నాకు తెలియదు. కానీ, కొడుకుని ఓ అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది’’ అని నాగబాబు వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని