మెగా మామకు తోడుగా చిన్న అల్లుడొచ్చాడు..!

సహాయనటుడిగా సినిమాలు చేస్తూనే, పలు కామెడీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న నటుడు నాగబాబు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెంచారు. గత కొన్నిరోజుల....

Published : 20 Feb 2022 11:51 IST

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: సహాయనటుడిగా సినిమాలు చేస్తూనే, పలు కామెడీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న నటుడు నాగబాబు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెంచారు. గత కొన్నిరోజుల నుంచి ఉదయాన్నే జిమ్‌లో వర్కౌట్లు చేసేందుకు వెళ్తున్నారు. ‘‘ఏదైనా సాధించాలంటే వయసు అసలు అడ్డంకే కాదు’’ అని పేర్కొంటూ ఇటీవల తన వర్కౌట్‌ వీడియోలను సైతం షేర్‌ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన తన చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేశారు. వైష్ణవ్‌తో కలిసి డంబెల్స్‌ లిఫ్ట్‌ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. ‘‘నా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ రూపంలో కొత్త జిమ్‌మేట్‌ని కలుసుకున్నా. పర్‌ఫెక్ట్‌ శరీరాకృతి పొందేందుకు పర్‌ఫెక్ట్‌ జిమ్‌ పార్ట్నర్‌తో కలిసి వర్కౌట్లు చేస్తున్నా. మామాఅల్లుళ్ల మేనియా’’ అని పేర్కొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని