Published : 26 Jun 2022 09:45 IST

Nagababu: దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు

నెటిజన్లకు నటుడి విజ్ఞప్తి

హైదరాబాద్‌: నెటిజన్లకు నటుడు నాగబాబు(Nagababu) చిన్న విజ్ఞప్తి చేశారు. ఇష్టమైన వారు మనతో ఉన్నప్పుడే వాళ్లపై మనకెంత ప్రేమ ఉందో తెలియజేయాలని కోరారు. శనివారం తన తండ్రి వెంకటరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. తన తండ్రి ఫొటోని షేర్‌ చేసిన ఆయన.. ‘‘నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న బుద్ధి, జ్ఞానం నాకు లేవు.. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే.. మీ ప్రియమైన వారు ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్లంటే మీకెంత ఇష్టమో వ్యక్తపర్చండి’ అని పేర్కొన్నారు.

ఇక, ఈ ఏడాది విడుదలైన ‘బంగార్రాజు’, ‘సర్కారువారిపాట’ చిత్రాల్లో నాగబాబు నటించారు. ‘బంగార్రాజు’లో యమ ధర్మరాజుగా కనిపించిన ఆయన ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు తండ్రి పాత్ర పోషించారు. నటుడిగానే కాకుండా రాజకీయాలతోనూ బిజీ అయ్యారు. తన సోదరుడు పవన్‌కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీలో కీలక నేతగా ఆయన కొనసాగుతున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts