- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
హైదరాబాద్: కథానాయిక సమంత(Samantha) పెంపుడు శునకం హాష్(HASH) ఎలా ప్రేమించాలో తనకు నేర్పిందని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ (Thank You) ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తన జీవితంలో కీలకపాత్ర పోషించిన వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ‘‘థ్యాంక్యూ.. అవసరమైన సందర్భంలో నేను ఎక్కువగా వాడే పదం ఇది. నా తదుపరి చిత్రం ‘థ్యాంక్యూ ది మూవీ’ రిలీజ్ కానున్న సందర్భంగా ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. నన్ను అమితంగా ప్రేమించి, నా జీవితంలో కీలకపాత్ర పోషించిన వారికే ఈ పోస్ట్‌ని అంకితం చేస్తున్నా. వారి ప్రేమకు కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అమ్మ.. నా వెన్నంటే ఉంటూ, ఎప్పటికప్పుడు నన్ను నిర్మిస్తూ, అన్నివిధాలుగా నన్ను ప్రేమిస్తున్నందుకు థ్యాంక్యూ. నాన్న.. ప్రతి విషయంలో నాకంటూ ఓ దారి చూపించి, ఓ స్నేహితుడిలా ఉన్నందుకు కృతజ్ఞతలు. అలాగే, హాష్.. ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేసి, నన్ను ఒక మనిషిగా ఉంచినందుకు థ్యాంక్యూ’’ అని చైతన్య పోస్ట్ పెట్టారు.
అంతేకాకుండా తమ జీవితాల్లో కీలక పాత్ర పోషించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ themagicwordisthankyou పేరుతో పోస్టులు పెట్టమని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ‘థ్యాంక్యూ’ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికాగోర్ కథానాయికలు. జులై 22 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 2017లో వివాహమైన తర్వాత నుంచి సామ్, చై.. హాష్ని పెంచుకొంటున్నారు. హాష్ ఫొటోలను గతంలో సామ్ తరచూ సోషల్‌మీడియాలో షేర్ చేసేది. గతేడాది చైతన్య-సామ్ విడిపోయిన నాటి నుంచి హాష్ ఆమె వద్దే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా చైతన్య పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: కాళేశ్వరం బయల్దేరిన కాంగ్రెస్ నేతలు అరెస్టు: మణుగూరు వద్ద ఉద్రిక్తత
-
India News
Swine flu: ముంబయిలో స్వైన్‌ఫ్లూ విజృంభణ.. 15రోజుల్లో ఎన్నికేసులంటే?
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
18న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
-
India News
Covid: దిల్లీలో కరోనా ఉద్ధృతి.. ప్రతిరోజు సగటున 8-10మంది మృతి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Karthikeya 2: కృష్ణతత్వం వర్కవుట్ అయింది.. నార్త్‌కు నచ్చేసింది!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!