Love Story: మాలీవుడ్‌కి నాగచైతన్య ‘లవ్‌స్టోరి’

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా క్లాస్‌ చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరి’.

Published : 19 Oct 2021 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా క్లాస్‌ చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరి’.  తెలుగునాట ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. మారుమూల పల్లెల నుంచి వచ్చిన రేవంత్‌, మౌనికలు తమ కలల్ని, ప్రేమను ఎలా సాధించుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ మూవీ ఇది. పలు సామాజిక సమస్యలను ఇందులో చర్చించారు. నటుడిగా నాగచైతన్యకి, దర్శకుడిగా శేఖర్‌కమ్ములకి మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఈ కథాంశం మలయాళ ప్రేక్షకులనూ అలరిస్తుందనే ఉద్దేశంతో కేరళలోనూ విడుదల చేస్తున్నారు. అక్కడ ‘ప్రేమతీరం’ పేరుతో ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవికి మాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘ప్రేమమ్‌’ సినిమా నుంచి ఆమెకు అక్కడ ప్రత్యేక అభిమానులున్నారు. నాగచైతన్య ‘ప్రేమతీరం’తో మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని