చైతూ బాగానే నటించాడు కానీ..! నాగార్జున

ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan)‌, కరీనాకపూర్‌(Kareena Kapoor), నాగచైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలు పోషించిన లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha) గతనెల(ఆగస్టు)11న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యింది. ఈ సినిమా పరాజయంపై...

Updated : 15 Nov 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan)‌, కరీనాకపూర్‌(Kareena Kapoor), నాగచైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలు పోషించిన లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha) గతనెల(ఆగస్టు)11న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యింది. ఈ సినిమా పరాజయంపై టాలీవుడ్‌ హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతున్న బ్రహ్రాస్త్రంలో కీలక పాత్ర పోషించిన నాగార్జున తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బ్రహ్మాస్త్రం(Brahmāstra) సినిమాతో భారతీయ సినిమా ఏకరూపత పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రాంతాల సంస్కృతిని మనం తెరపై చూడొచ్చని తెలిపారు. ఇక నుంచి ప్రతీ చిత్రం భారతీయ సినిమాగా విడుదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే లాల్‌ సింగ్‌ చడ్డాతో నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ తండ్రిగా మిమ్మల్ని నిరాశపరిచిందా అని మీడియా ప్రశ్నించగా నాగార్జున ‘కోవిడ్‌ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది. కొన్ని సినిమాలను వారు టీవీలో చూడాలనుకుంటున్నారు. కొన్ని సినిమాలకు మాత్రమే థియేటర్‌కు వెళ్లాలనుకుంటున్నారు. సినిమా ఆడకపోవడానికి ప్రస్తుతం అనేక అంశాలు కారణమవుతున్నాయి. నేను లాల్‌ సింగ్‌ చడ్డా చూశాను. అది మంచి సినిమా. అందరూ బాగా నటించారు. నాకు నాగ చైతన్య పాత్ర బాగా నచ్చింది. అతను బాగా నటించినా కొన్ని వేరే కారణాల వల్ల ఆ సినిమా ఆడలేదు’ అని తెలిపారు. అజయ్‌ వశిష్ఠ్‌ గా బ్రహ్మాస్త్రం చిత్రంలో అలరించిన నాగార్జున నంది అస్త్ర పాత్రను పోషించారు. అక్టోబరు5న నాగార్జున కథానాయకుడిగా నటించిన ది ఘోస్ట్‌(The Ghost) చిత్రం విడుదల కానుంది. ప్రవీణ్‌ సత్తారు(Praveen Sattaru) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నాగార్జున(The Ghost) సరసన సోనాల్‌ చౌహన్‌(Sonal Chauhan) కథానాయికగా నటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని