The Ghost: పోరాటానికి సన్నద్ధం

తుది పోరాటం కోసం సన్నద్ధం అవుతున్నారు   నాగార్జున. ఆయన కథా  నాయకుడిగా... ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్‌’ తెరకెక్కుతోంది. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌,

Updated : 25 Apr 2022 09:53 IST

తుది పోరాటం కోసం సన్నద్ధం అవుతున్నారు   నాగార్జున. ఆయన కథా  నాయకుడిగా... ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్‌’ తెరకెక్కుతోంది. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వారం నుంచే హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నాగార్జున, విదేశీ ఫైటర్లపై  చిత్రీకరించనున్న ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ కథలో నాయకానాయికలిద్దరూ ఇంటర్‌పోల్‌ అధికారుల పాత్రల్లో  కనిపించనున్నారు. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని