Nagarjuna: అందుకే సీఎం జగన్‌కు కలిసేందుకు వెళ్లలేదు: నాగార్జున

చిరంజీవి తన ఒక్కడి కోసం ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేందుకు వెళ్లలేదని మొత్తం సినీ పరిశ్రమ తరపున మాట్లాడటానికి వెళ్లారని

Updated : 13 Jan 2022 13:33 IST

హైదరాబాద్‌: చిరంజీవి(Chiranjeevi) ఆయన ఒక్కడి కోసం ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేందుకు వెళ్లలేదని మొత్తం సినీ పరిశ్రమ తరపున మాట్లాడటానికి వెళ్లారని అగ్ర కథానాయకుడు నాగార్జున(Nagarjuna) అన్నారు. నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం నాగార్జున విలేకరులతో మాట్లాడారు.

‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేనూ చిరంజీవిగారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వారం రోజుల కిందట నాకు ఫోన్‌ చేసి ‘సీఎం జగన్‌ను కలవబోతున్నా’ అని చెప్పారు. నన్ను కూడా అడిగారు. కానీ, ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉండటంతో రావటం కుదరదని చెప్పా. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయని, ప్రభుత్వాలు కూడా రోజుకో కొత్త నిబంధన విధిస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు.

టికెట్‌ రేట్ల గురించి నాగార్జునను ప్రశ్నించగా, ‘‘గతేడాది ఏప్రిల్‌లో జీవో నెం.35 విడుదల చేశారు. ఒక సినిమా హిట్‌ అయితే ఇంత కలెక్ట్‌ చేస్తుందా? లేదా? అని లెక్కలు వేసుకున్నాం. వరుసగా సినిమాలు తీస్తుంటాం. ఎక్కువ బడ్జెట్‌ వేసి చెప్పేది లేదు. అలాగని తక్కువా చెప్పం. ‘బంగార్రాజు’ సినిమా వరకూ ఆ టికెట్‌ రేట్లు వర్కవుట్‌ అవుతాయని అనిపించింది. మరొక సినిమాకు కాకపోవచ్చు. రేట్లు పెరిగితే మాకు బోనస్‌ వచ్చినట్లే. సినిమా ఆడకపోతే చేసేదేమీ లేదు. దాని కోసం సినిమా రిలీజ్‌ చేయకుండా ఉండలేను. రెండేళ్ల పాటు సినిమా లేకుండా ఇంట్లో కూర్చొన్నా. బిగ్‌బాస్‌ ఉంది కాబట్టి, నాకు ఇన్నాళ్లూ ఎంటర్‌టైనింగ్‌ అయింది.’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని