The Ghost: ఊటీలో.. ‘ది ఘోస్ట్‌’

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా    నిర్మించారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక.

Updated : 09 Apr 2022 08:54 IST

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే దుబాయ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్‌ ఘట్టాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. కొత్త షెడ్యూల్‌ ఊటీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌ సత్తారు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి’’ అంటూ సెట్లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు, నభా మాస్టర్‌, ఛాయాగ్రహణం: జి.ముఖేష్‌.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని