Nagarjuna: నాగార్జున 100వ చిత్రంపై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది!

నాగార్జున వందో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని కోసం ఓ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ దర్శకుడు మోహన్‌రాజాతో ఈ సినిమా ఉండనుంది.

Updated : 10 Oct 2022 17:35 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగార్జున మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వందో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాగ్‌... దీని కోసం ఓ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ లాంటి భారీ హిట్‌ను చిరంజీవికి అందించిన మోహన్‌రాజాతో ఈ సినిమా ఉండనుంది. ఈ విషయం గత కొద్ది రోజులుగా కొంతమంది నోట వింటున్నా.. అది నాగార్జున వందో సినిమానా? కాదా? అనే డౌట్‌ ఉండేది. ఇప్పుడది క్లియర్‌ అయ్యింది.

నాగార్జున తన 100వ సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్న దీనిపై ఒకరిద్దరు దర్శకులతో చర్చించారట. అయితే మోహన్‌రాజా చెప్పిన కథ నచ్చడంతో.. పచ్చ జెండా ఊపేశారట. ఈలోపు చిరంజీవి నుంచి రిక్వెస్ట్‌ రావడంతో మోహన్‌రాజా ‘గాడ్‌ఫాదర్‌’ చేసుకోవడానికి నాగ్‌ ఓకే చేశారట. ఈ విషయాన్ని ‘గాడ్‌ఫాదర్‌’ నిర్మాతల్లో ఒకరైనా ఎన్వీ ప్రసాద్‌ ఇటీవల చెప్పారు. మరోవైపు నాగ్‌ సినిమాకు స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధమైందని, మరోసారి అంతా చెక్‌ చేసుకుని సినిమా స్టార్ట్‌ చేస్తామని కొన్ని రోజుల క్రితం మోహన్‌రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఇదిలా ఉండగా.. సినిమాలకు ఆరు నెలల గ్యాప్‌ ఇస్తానని ఆ మధ్య ‘ది ఘోస్ట్‌’ ఇంటర్వ్యూల్లో నాగార్జున అన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఆరు నెలల తర్వాత అంటే వచ్చే సమ్మర్‌లో నాగార్జున - మోహన్‌రాజా సినిమా ఉంటుంది. అన్నట్లు ఈ సినిమాలో అఖిల్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట. మంచి ఎమోషన్స్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేశానని మోహన్‌రాజా ఇప్పటికే వెల్లడించారు. సో.. నాగార్జున మైల్‌స్టోన్‌ సినిమా పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అప్పుడు మరిన్ని అప్‌డేట్స్‌ వస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని