జులైలోనే ‘బంగార్రాజు’ ప్రారంభం?

అక్కినేని నాగార్జున మాస్‌ యాక్షన్‌ కథాచిత్రాలతో పాటు కుటుంబ, ప్రేమకథా చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లోనూ సందడి చేస్తుంది. 

Published : 26 Apr 2021 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఏడేళ్ల క్రితం కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో బంగార్రాజు - రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కల్యాణ్ ఎప్పుడో ప్రకటించాడు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ జులైలో ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇందులో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారని సమాచారం.

ఆ మధ్య ‘వైల్డ్డాగ్‌’ మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ..‘బంగార్రాజు’ చిత్రం షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామని’’ వెల్లడించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని