Nagashourya: కృష్ణ వ్రింద విహారి

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. షిర్లే సెటియా కథానాయిక. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు.

Updated : 23 Jan 2022 06:56 IST

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. షిర్లే సెటియా కథానాయిక. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. శనివారం నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారి’ అనే పేరుని ఖరారు చేయడంతోపాటు, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. సంప్రదాయం ఉట్టిపడే వేషధారణతో నాగశౌర్య సందడి చేస్తున్నారు ప్రచార చిత్రంలో. ‘‘కుటుంబ  వినోదంతో కూడిన చిత్రమిది. నాగశౌర్య  భిన్నంగా, సరికొత్త పాత్రలో ఇందులో కనిపిస్తారు. ఒక పాట మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కూర్పు: తమ్మిరాజు, కళ: రామ్‌కుమార్‌, సంగీతం: మహతి స్వరసాగర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు