God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ పవర్‌ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది.. అడవి తల్లికి అన్నయ్య!

చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది.

Published : 27 Sep 2022 17:19 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తొలి పాటను పంచుకోగా ఇప్పుడు రెండో పాటను రిలీజ్‌ చేసింది. ‘నజభజ’ (Najabhaja) అనే ఈ పాటను యాక్షన్‌ నేపథ్యంలో చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని వివరించే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్‌ రాశారు. శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించారు. తమన్‌ స్వరాలందించారు. ‘అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కలబడితే కథకళిరా’ తదితర చరణాలు పవర్‌ఫుల్‌గా సాగాయి. మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ ‘గాడ్‌ ఫాదర్’లో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని