Updated : 02/10/2020 11:16 IST

వావ్‌.. ‘నక్కిలీసు గొలుసు’ ఎన్ని వేరియేషన్‌లో!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ‘వై దిస్‌ కొలవెరి’ అంటూ ప్రపంచం ఊగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గంగ్నమ్‌ డ్యాన్స్‌ ఓ ఊపు ఊపేసింది. ఒక్కో సమయంలో ఒక్కో పాట, ఒక్కో డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ విశేష ఆదరణ పొందుతాయి. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అన్న తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తాయి. ఇక తెలుగులో ఎప్పుడూ ఏదో ఒక పాట ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో మొబైల్‌ ఫోన్లలో, ఎఫ్‌ఎం రేడియోల్లో, ఫంక్షన్లలో పాట మార్మోగాల్సిందే.

ఇప్పుడు ట్రెండ్‌ ‘నక్కిలీసు గొలుసు’ది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రక్షిత్‌, నక్షత్ర కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రఘు కుంచె స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘నక్కిలీసు గొలుసు’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక టిక్‌టాక్‌(బ్యాన్‌ కాకముందు)స్టార్‌ దుర్గారావు అనేక వేరియేషన్స్‌లో డ్యాన్స్‌ చేసి ఈ పాటకు మరింత ప్రాచుర్యం తెచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’లోనూ పండు ఈ పాటకు డ్యాన్స్‌ చేయగా, అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వీడియోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరిన్ని రూపాల్లో ఈ సాంగ్‌ అలరిస్తోంది. సంగీత దర్శకుడు రఘు కుంచె కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదండోయ్‌ పలువురు కథానాయకులు వేరే పాటలకు వేసిన డ్యాన్స్‌ను ఈ పాటతో రీమిక్స్‌ చేసి, వారి అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఆ వీడియోల సమాహారం చూసేయండి.
















Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని