నమ్రత నా స్నేహితురాలు: మంజుల

సహజంగా అనేక కుటుంబాల్లో చాలా వరకు  కోడళ్లకు - ఆడపడుచులకు మధ్య పెద్దగా సఖ్యత కనిపించదు. ఒకరిపై ఒకరు కస్సుబుస్సుమంటుంటారు. కానీ ఇక్కడ ఓ ఆడపడుచు మాత్రం మా మరదలు ఎంతో మంచిదని కితాబిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురు...

Published : 03 Jun 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సహజంగా అనేక కుటుంబాల్లో చాలా వరకు  కోడళ్లకు - ఆడపడుచులకు మధ్య పెద్దగా సఖ్యత కనిపించదు. ఒకరిపై ఒకరు కస్సుబుస్సుమంటుంటారు. కానీ ఇక్కడ ఓ ఆడపడుచు మాత్రం మా మరదలు ఎంతో మంచిదని కితాబిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురు, దర్శకురాలు ఘట్టమనేని మంజుల. తాజాగా ఆమె మహేష్‌బాబు సతీమణి నమత్రతో కలిసి ఉన్న ఓ పొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘నమ్రతతో కలిసి గడిపే సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తాను. ఆమె నా మరదలు మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలు కూడా. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమర్థత కలిగిన వ్యక్తి నమత్ర’’ అంటూ పేర్కొంది. ఇటీవల కృష్ణ పుట్టినరోజు వేడుకను ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. మంజుల ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం చేసింది. అంతకు ముందే ‘షో’, ‘కావ్యాస్‌ డైరి’, ‘సేవకుడు’ లాంటి చిత్రాల్లోనూ నటించింది. ‘ఆరెంజ్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ సోదరిగా చేసింది. ప్రస్తుతం ‘నషా’ అనే వెబ్‌ సీరీస్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని