Gautham Ghattamaneni: లండన్‌లో గౌతమ్‌ యాక్టింగ్‌.. గర్వంగా ఉందన్న నమ్రతా శిరోద్కర్‌

మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ లండన్‌లో తొలిసారి స్టేజ్‌ ప్రదర్శన ఇచ్చాడు. దాని గురించి అభిమానులకు తెలియజేస్తూ నమ్రతా శిరోద్కర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Published : 23 Jun 2024 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కుమారుడు గౌతమ్‌ (Gautham Ghattamaneni)ను చూస్తే గర్వంగా ఉందన్నారు నమ్రతా శిరోద్కర్‌ (Namrata Shirodkar). నటనతో అందరినీ ఆకట్టుకున్నాడంటూ ప్రశంసలు కురిపించారు. గౌతమ్‌ లండన్‌లో ఇచ్చిన తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

తెలంగాణలో ‘కల్కి’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌

‘‘గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మహేశ్‌ బాబు (Mahesh Babu), సితార, నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్‌ తదితరులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గౌతమ్‌ ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. మహేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘1 నేన్కొక్కడినే’ (1 Nenokkadine) లో కనిపించి అలరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని