Balakrishna: నందమూరి వంశానికే ఆ ఘనత దక్కుతుంది: బాలకృష్ణ

కొత్త వారికి సైతం గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. మొదటి అవకాశంలోనే వశిష్ఠ్‌ ‘బింబిసార’ (Bimbisara) లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించడంపై ....

Updated : 14 Aug 2022 13:18 IST

‘బింబిసార’ వీక్షించిన బాలయ్య

హైదరాబాద్‌: కొత్త వారికి సైతం గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. మొదటి అవకాశంలోనే వశిష్ఠ్‌ ‘బింబిసార’ (Bimbisara) లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించడంపై బాలయ్య కొనియాడారు. తాజాగా కుటుంబసభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. ‘‘సినిమా అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్‌. ఇలాంటి మంచి చిత్రాలు ప్రేక్షకులకు నువ్వు మరిన్ని అందించాలని బాబాయ్‌గా కోరుకుంటున్నా. వశిష్ఠ్‌.. చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించావు. త్వరలోనే మనం కలిసి పనిచేద్దాం. మీలాంటి టాలెంట్‌ ఉన్న యువత ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావాలి. మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకోవాలి. ఒక్కొ మెట్టు ఎక్కుతూ ముందుకెళ్లడం వేరు. కానీ, మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించావు. టాలెంట్‌ని నమ్మి కొత్తవారికి సైతం గొప్ప అవకాశాలివ్వడం నందమూరి వంశానికి దక్కుతుంది. సినిమాల్లో కొత్త ఒరవడి ఏదైనా నాన్నగారితోనే మొదలైంది. ఏదైనా మాతో ప్రారంభం కావాల్సిందే. గతంలోనూ నాన్న గారు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. వాటిని ప్రేక్షకులు ఆదరించారు. ‘బింబిసార’ ప్రయోగాత్మక చిత్రమే కాదు.. ఈకథలో ఎన్నో నిజాలున్నాయి. భావితరాలకు మంచి సందేశం ఉంది. అందరూ చూడండి. ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. ఇదొక కల్పిత కథ. ఇందులో కల్యాణ్‌రామ్‌ క్రూరమైన రాజు బింబిసార పాత్రలో నటించారు. రాజ్యకాంక్షతో అతడు ఇతరుల్ని ఎలా ఇబ్బందులకు గురి చేశాడు? టైమ్‌ ట్రావెల్‌ చేసి తన తప్పులు ఎలా సరి చేసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. ఆగస్టు  మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞ, పురందేశ్వరి, లోకేశ్వరి ఇతర కుటుంబసభ్యులందరూ కలిసి ‘బింబిసార’ వీక్షించారు.
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని