Nandamuri Balakrishna: సెట్లో సందడికి సన్నాహాలు

ఎన్నికల హడావుడి ముగియడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Published : 14 Jun 2024 00:46 IST

న్నికల హడావుడి ముగియడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి పునఃప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్‌లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో ఈ కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందని తెలిసింది. దీనిలో భాగంగా బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్‌ సంగీతమందిస్తుండగా.. విజయ్‌ కార్తీక్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని