balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్‌

సినీ నటుడు, హిందూపూర్‌ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ(Bala krishna) కరోనా బారినపడ్డారు.

Updated : 24 Jun 2022 17:50 IST

హైదరాబాద్‌: సినీ నటుడు, హిందూపూర్‌ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ(Bala krishna) కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు పంచుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, ‘అఖండ’ విజయంతో బాలకృష్ణ జోరుమీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు వ్యాఖ్యాతగానూ బాలకృష్ణ మరోసారి అలరించనున్నారు. ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని