
Bimbisara: రాజ్యం మీసం మెలేసింది
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. వశిష్ట దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని కథానాయకుడు కల్యాణ్‌రామ్ సోమవారం ట్విటర్ ద్వారా విడుదల చేశారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్ కత్తి చేతపట్టి చేసిన విన్యాసాలు, విజువల్స్‌తో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే... ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏక ఛత్రాధిపత్యం’’ అనే సంభాషణతో టీజర్ సాగింది. ‘‘కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న సినిమా ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్, ఛాయాగ్రహణం: సంతోష్ నారాయణ్, కూర్పు: తమ్మిరాజు, మాటలు: వాసుదేవ్ మునెప్పగారి.