నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ...లాంచ్‌ చేయనున్న యువ దర్శకుడు?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల నుంచి అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో...

Published : 10 Sep 2022 22:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల నుంచి అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యువకథానాయకుల జోరు కొనసాగుతున్నా వారికి దీటుగా బాలయ్య విజయాలను సాధిస్తున్నారు. అయితే ఆయన నటవారసత్వాన్ని కొనసాగించే నందమూరి మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) సినీ ఎంట్రీ ఎప్పుడా అని ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రూమర్లు వచ్చిన అవేవీ నిజం కాలేదు. గతంలో ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞపై తనకు చాలా ఆశలున్నాయని, తాను దర్శకత్వం వహించే ‘ఆదిత్య-369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పినా, దానిపై తర్వాత ఎటువంటి వార్తలు రాలేదు.

అయితే కొద్దిరోజుల క్రితం ఎన్‌బీకే-107 షూటింగ్‌ సెట్‌లో మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరపడంతో మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఒక విజయవంతమైన యువదర్శకుడిని రంగంలోకి దించిన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. టాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ బాధ్యతలు స్వీకరించనున్నారట. నందమూరి మోక్షజ్ఞ కోసం కథ సిద్ధం చేసేందుకు ఈ యువ దర్శకుడు రెడీ అయ్యారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఇటీవల మోక్షజ్ఞ, బాలకృష్ణలను కలిసిన రాహుల్‌ వారి వద్ద గ్రీన్‌సిగ్నల్‌ పొందినట్లు సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే నందమూరి కుటుంబం నుంచి మరో కథానాయకుడిని తెరపై చూడొచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని