Nandini Reddy: తిరుపతి కాంట్రవర్సీ.. నందిని రెడ్డి క్లారిటీ

సంతోశ్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ జంటగా నందినిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Shakanamule). ఈ సినిమా ప్రమోషన్స్‌లో చోటుచేసుకున్న ఓ కాంట్రవర్సీ గురించి తాజాగా నందినిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Published : 14 May 2023 01:44 IST

హైదరాబాద్‌: తిరుపతి వేదికగా ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Shakanamule) ప్రమోషన్స్‌లో జరిగిన ఓ సంఘటనపై దర్శకురాలు నందినిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విలేకర్లతో తాను గొడవ పడలేదని చెప్పారు. ఆరోజు విలేకర్ల సమావేశంలో ఏం జరిగిందో వివరించారు.

‘‘సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మేము తిరుపతి వెళ్లాం. మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి చేరుకున్న మేము భోజనం చేసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాం. అయితే ప్రెస్‌మీట్‌ మూడు గంటలకే అని విలేకర్లకు చెప్పారట. మేము గంటన్నర ఆలస్యంగా వెళ్లేసరికి వాళ్లకు చిరాకు వచ్చినట్టు ఉంది. సంతోశ్‌ శోభన్‌ మైక్‌ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టగానే ఓ విలేకరి.. ‘‘మీరు ఎవరో మాకు తెలియదు. పరిచయం ఇచ్చి మాట్లాడండి’’ అని కాస్త గట్టిగా అన్నాడు. ఆయన మాటలు నాకు ఇబ్బందిగా అనిపించాయి. వెంటనే మైక్‌ తీసుకుని నటీనటులు, వైజయంతి బ్యానర్‌, నా గురించి మేము చేసిన సినిమాల గురించి చెప్పాను. సంతోశ్‌ని పిలిచి.. ‘‘ఎందుకైనా మంచిది నువ్వు కూడా నీ పరిచయం ఇచ్చుకో’’ అని చెప్పా. ఆ మాట సదరు విలేకరికి నచ్చలేదు అనుకుంటా. ‘‘అన్నిసార్లు మీరు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని అన్నాడు. దాంతో నేను.. ‘‘సార్‌.. మేము ఏం చెప్పాలో, ఎన్నిసార్లు చెప్పాలో మీరే చెబుతారు. కాబట్టి, నాదొక రిక్వెస్ట్‌. ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు సినిమా ఏంటి? ఎవరు చేస్తున్నారు? అనేది సెర్చ్‌ చేసి ఉంటే మంచిగా ప్రశ్నలు అడగటానికి మీకు అవకాశం ఉంటుంది కదా. అలాగే మాక్కూడా మంచి సమాధానాలు చెప్పే ఛాన్స్‌ వచ్చేది కదా’’ అని మర్యాదపూర్వకంగా చెప్పానంతే. కాకపోతే దాన్ని అందరూ కౌంటర్‌ అనుకుంటున్నారు’’ అని నందినిరెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని