Samantha: సమంతా.. నువ్వు ఫీల్ అవుతావని ఆ పోస్ట్ పెట్టలేదు: నందినిరెడ్డి
అగ్రకథానాయిక సమంత (Samantha) షేర్ చేసిన ఓ వీడియోపై స్పందించారు దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy). సమంత చేస్తోన్న వర్కౌట్‌ను తాను ఒంటి చేత్తో చేస్తోన్నట్లు చెప్పారు.
హైదరాబాద్: ఫిట్‌నెస్ (Fitness) విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు అగ్ర కథానాయిక సమంత (Samantha). తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫిట్‌నెస్ వీడియోపై దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) స్పందించారు. సమంత రెండు చేతులతో చేస్తోన్న వర్కౌట్‌ను తాను ఒక్క చేత్తోనే చేశానని చెప్పారు. సామ్ ఫీలవుతుందనే కారణంతో ఆ వీడియోను తాను పోస్ట్ చేయలేదని సరదాగా అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మయోసైటిస్ నుంచి కోలుకుంటోన్న సమంత ఇప్పుడిప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్ ‘సిటాడెల్’పై దృష్టి సారించారు. తన పాత్రకు అనుగుణంగా సిద్ధమయ్యే క్రమంలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జిమ్‌లో పుల్ అప్స్ చేస్తోన్న ఓ వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘ క్లిష్టమైన రోజుల్లో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన ‘హూ ఈజ్ గ్రావిటీ’ బ్యాండ్‌కు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ కఠినతరమైన డైట్‌లో ఉన్నందువల్ల.. తిన్న ఆహారం వల్లే బలం రాదని.. మన ఆలోచనా విధానం పైనా అది ఆధారపడివుంటుందని నా అభిప్రాయం’’ అని సమంత రాసుకొచ్చారు. దీనిపై పలువురు సినీ తారలు స్పందిస్తూ ఆమెకు మరింత బలం చేకూరాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా దీనిపై నందిని రెడ్డి సైతం ఇలా అన్నారు. నందూ పెట్టిన కామెంట్‌పై పలువురు నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్