
Dhee 14: కన్నీటి పర్యంతమైన నందితా, ప్రదీప్.. భావోద్వేగంగా ‘ఢీ’
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ డ్యాన్సులు, నవ్వులతో సందడిగా ఉండే ‘ఢీ 14’ వేదికపై భావోద్వేగం చోటుచేసుకుంది. తమను పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను భారంగా భావించే వారికి కునువిప్పు కలిగేలా ఓ స్కిట్ ఈ షోలో ప్రదర్శితమైంది. ఈ నేపథ్యంలో తన తండ్రిని తలచుకుని న్యాయనిర్ణీతల్లో ఒకరైన నందితా శ్వేత కంటతడి పెట్టుకుంది. ఇటీవల మరణించిన తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైంది. మరోవైపు, తన తండ్రిని తలచుకుని కార్యక్రమ వ్యాఖ్యాత ప్రదీప్ ఎమోషన్ అయ్యారు. అనంతరం, టీమ్ లీడర్లు హైపర్ ఆది, రవి అలనాటి హీరోలను తలపించేలా రెడీ అయి, తమదైన శైలిలో కామెడీ పండించారు. ‘డీజే టిల్లు’ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ‘నీలి నీలి ఆకాశం’ పాటను విచారంగా ఆలపించిన ఆది అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఈ ఫన్ అండ్ ఎమోషన్ ఎపిసోడ్ ‘ఈటీవీ’లో బుధవారం రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్!
-
Politics News
Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్‌రెడ్డి
-
World News
Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్