Nani: 30వ చిత్రం.. 21న

ఒకవైపు ‘దసరా’ థియేటర్లలో సందడి చేస్తుండగానే... మరోవైపు నాని (Nani) కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారైంది.  ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 30వ చిత్రం క్రిస్మస్‌ సీజన్‌లో...డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 16 Apr 2023 07:22 IST

ఒకవైపు ‘దసరా’ (dasara) థియేటర్లలో సందడి చేస్తుండగానే... మరోవైపు నాని (Nani) కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారైంది.  ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 30వ చిత్రం క్రిస్మస్‌ సీజన్‌లో...డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని చిత్రబృందం శనివారం అధికారికంగా వెల్లడించింది. శౌర్య అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని ఓ చిన్నారికి తండ్రిగా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల బంధం ప్రధానంగా సాగే చిత్రమని స్పష్టమవుతోంది. నానికి జోడీగా ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని