Nani: ముంబయిలో ముగించి.. కూనూర్‌కు పయనం
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. చెరుకూరి మోహన్, తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. చెరుకూరి మోహన్, తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే గోవాలో ఓ సుదీర్ఘ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా..తాజాగా ముంబయి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో నాని తన ముఖాన్ని హుడీతో కప్పుకొని సముద్రపు ఒడ్డున నడుస్తూ కనిపించారు. తర్వాతి షెడ్యూల్‌ను కూనూర్‌లో ప్రారంభించనున్నట్లు ఈ వీడియోతో స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది నానికి 30వ సినిమా. వినూత్నమైన కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తండ్రీకూతుర్ల అనుబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు