Nani: నా అభిప్రాయం చెప్పినా సమస్యే అవుతోంది: నాని
‘దసరా’ (Dasara) ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇస్తోన్న ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు నటుడు నాని (Nani). నటుడిగా తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాలను ఇటీవల వెల్లడించిన ఆయన.. తాజాగా తనపై వచ్చిన కాంట్రవర్సీల గురించి పెదవి విప్పారు.
హైదరాబాద్: ఇటీవల కాలంలో తనపై వచ్చిన వివాదాల గురించి బాలీవుడ్ మీడియాతో చర్చించారు నటుడు నాని (Nani). తాను ఏం మాట్లాడినా సమస్యే అవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు గతంలో తాను టికెట్ ధరల విషయంపై అభిప్రాయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచినట్లు వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ (Sukumar)ని తక్కువ చేసి తాను మాట్లాడినట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు. సుకుమార్ అంటే గౌరవం ఉందని, తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని అన్నారు.
‘దసరా’ (Dasara) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ‘‘చిన్న విషయానికే పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారా?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘సమస్యలు ఎదుర్కొన్నాను. నేను మాట్లాడిన చిన్న చిన్న మాటలే పెద్ద సమస్యలు తీసుకువచ్చాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు చెబితే అది మరొక సమస్యకు దారి తీస్తుంది. ఉదాహరణకు.. ‘శ్యామ్ సింగరాయ్’ సమయంలో టికెట్ ధరల గురించి నా అభిప్రాయాన్ని మామూలుగా చెప్పాను. ఆ తర్వాత అదే పెద్ద సమస్యగా మారింది. నేను ఏం మాట్లాడినా సరే ఎదుటివాళ్లు మరోలా అర్థం చేసుకుని.. ‘‘మీరు అలా ఎలా చెబుతున్నారు?’’, ‘‘ఇలా ఎందుకు అంటున్నారు?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులను కించపరిచేలా అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం లేదు. కేవలం నా ఉద్దేశాన్ని చెబుతున్నానంతే’’
‘‘ఇటీవల సుకుమార్ (Sukumar) విషయంలోనూ అదే జరిగింది. ఇంత చర్చకు దారితీసేలా నేను వ్యాఖ్యలు చేయలేదు. ‘దసరా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నేనొక మీడియా సమావేశంలో పాల్గొన్నాను. అందులో ఓ విలేకరి.. ‘‘ప్రతి ఒక్కరూ అగ్ర దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మీరెందుకు ఇలా కొత్త దర్శకులతో వెళ్తున్నారు?’’ అని ప్రశ్నించాడు. దానికి నేను.. ‘‘ఆయా దర్శకులకు మన దగ్గర పాపులారిటీ ఉన్నప్పటికీ వేరే పరిశ్రమలకు వాళ్లు కొత్తే కదా. సుకుమార్‌కు తెలుగులో గొప్ప పేరు ఉండొచ్చు కానీ ‘పుష్ప’ తర్వాతనే ఆయన వేరే చోట్ల ఖ్యాతి సొంతం చేసుకున్నారు. నా దర్శకుడు ఇప్పుడు అన్ని పరిశ్రమలకు కొత్త వాడే అయినా తర్వాత మంచి పేరు సొంతం చేసుకోవచ్చు’’ అంటూ నా దర్శకుడికి సపోర్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాను. కాకపోతే, వాటిని తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు’’ అని నాని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral: ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. వివాదంలో ఎడ్టెక్ కంపెనీ
-
Politics News
Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా
-
India News
Rujira Narula Banerjee: అభిషేక్ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత
-
India News
China: భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్ హౌస్
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ