TNR మృతి: కరోనా ఇకనైనా దయచూపు: టాలీవుడ్‌

కరోనా మహమ్మారి వల్ల చిత్రసీమ మరో కళాకారుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, జర్నలిస్టు, ఇంటర్వ్యూయర్‌ టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహారెడ్డి) మృతిని చిత్రసీమ జీర్ణించుకోలేకపోతోంది. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు.

Updated : 10 May 2021 18:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి వల్ల చిత్రసీమ మరో కళాకారుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, జర్నలిస్టు, ఇంటర్వ్యూయర్‌ టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహారెడ్డి) మృతిని చిత్రసీమ జీర్ణించుకోలేకపోతోంది. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. నాని, విజయ్‌ దేవరకొండ, మంచు విష్ణుతో పాటు పలువురు నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

* టీఎన్‌గారి మరణవార్త విస్మయానికి గురిచేసింది. ఆయన చేసిన కొన్ని ఇంటర్వ్యూలు చూశాను. అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. - నాని

* మీతో చేసిన రెండు సుదీర్ఘ సంభాషణలు ఇంకా గుర్తున్నాయి. మీరు కన్నుమూయడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ సంభాషణలు, ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్‌ యూ సర్‌. - విజయ్‌ దేవరకొండ

* టీఎన్‌ఆర్‌ గారి మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్‌లో బెస్ట్‌ ఇంటర్వ్యూ. ఆయన సన్నిహితులకు నా సంతాపం. - మంచు విష్ణు

* నమ్మలేని వార్త. నా స్నేహితుడు టీఎన్‌ఆర్‌ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ  సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మావల్ల కాదు.  - డైరెక్టర్‌ మారుతి

* మీ ఆకస్మిక మరణం మా హృదయాలను కలచివేస్తోంది. మృదువైన మాటతీరు గల మనిషి. మిస్ యూ సర్. మీ కుటుంబానికి నా సానూభూతి.  - అనిల్‌ రావిపూడి

* టీఎన్‌ఆర్‌ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.   - డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని

* విస్మయానికి గురయ్యాను. మిస్‌ యూ టీఎన్‌ఆర్‌గారు. - సందీప్‌ కిషన్‌

* నా సినిమా కెరీర్‌ మీ వల్లే ప్రారంభమైంది. మీరు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను‌. మిస్‌ యూ సర్‌.. - అనన్య నాగళ్ల

* మీ ఆత్మకు శాంతి చేకూరాలి. - ఈషా రెబ్బ

* టీఎన్‌ఆర్‌ గారు ఇక లేరన్న వార్త వినడం నిజంగా బాధ కలిగించింది. విచారంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి. - సునీల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని