ఫుట్‌బాల్‌ ఆటగాడిగా నాని?

పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో నాని ఫుట్‌బాల్‌ ఆటగాడిగా కనిపించనున్నాడట.

Published : 22 May 2021 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యువ కథానాయకుడు నాని పలు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చేస్తున్నారు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’ ఇప్పటికే పూర్తయింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే ఆయన మరో చిత్రానినికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో నాని ఫుట్‌బాల్‌ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు కూడా విన్నాడట. అయితే దీనికి గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రటకన రానుందని సమాచారం. గతంలో నాని క్రీడా నేపథ్యంలో ‘భీమిలి కబడ్డిజట్టు’ చేశారు. ఇక 2019లో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్‌ నేపథ్యంగా ‘జెర్సీ’లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని