Nani: ఆ సినిమాలో నటించి ఉంటే బాగుండేది అనిపించింది: నాని
కామెడీ కథలకు కొంతకాలంగా దూరంగా ఉన్న నాని ‘అంటే... సుందరానికీ!’ చిత్రంతో ఆ లోటును తీర్చబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ స్థాయిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: కామెడీ కథలకు కొంతకాలంగా దూరంగా ఉన్న నాని ‘అంటే... సుందరానికీ!’ చిత్రంతో ఆ లోటును తీర్చబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ స్థాయిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘..సుందరానికీ!’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివీ..
* ఈ సినిమా ట్రైలర్లో మీ పాత్ర అమాయకత్వంగా కనిపించింది. దీనికోసం ఎలా సన్నద్ధమయ్యారు?
నాని: ఇతర వాటితో పోలిస్తే అమాయకత్వ పాత్రలు పోషించడం నాకు సులువైన పని. నేను ఇందులో బ్రాహ్మణ కుర్రాడు సుందర్ అనే పాత్ర పోషించా. సుందర్‌ది విభిన్నమైన అమాయకత్వం. మీరు ఊహించినట్టు ఉండదు. సుందర్ చేసే చిలిపి పనులన్నీ అమాయకత్వంతో బయటపడతాయి. నరేశ్ గారితో వచ్చే సన్నివేశాలు మరింత ఫన్ పంచుతాయి. ఈ సినిమాతో మా కాంబినేషన్ మరో స్థాయిలో నిలవబోతుంది.
* ఈ సినిమాలో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది?
నాని: నా గత చిత్రాల్లో కనిపించని టైమింగ్ ఇందులో ఉంటుంది. చాలా సరదాగా సాగుతుంది. ఇందులో కొత్త నాని, సరికొత్త హావభావాలను మీరంతా చూస్తారు. ప్రేక్షకులంతా ఈ క్యారెక్టర్లో లీనమవుతారనే నమ్మకం ఉంది.
* దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్రయాణం ఎలా అనిపించింది?
నాని: రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకులతో ఎందుకు పనిచేస్తున్నావంటూ చాలామంది నన్ను అడుగుతుంటారు. ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్న దర్శకుల కంటే భవిష్యత్తులో టాప్ డైరెక్టర్ల జాబితాలో నిలిచే వారితో పనిచేయడం నాకు ఆనందాన్నిస్తుంది. వివేక్ నాకు కథ చెప్పినప్పుడే ఆయన త్వరలోనే అగ్ర దర్శకుల లిస్ట్‌లో చేరతారనే నమ్మకం కలిగింది. వివేక్ రచనా, దర్శకత్వం అద్భుతంగా ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ తన మార్క్ కనిపిస్తుంది. నా కెరీర్ ప్రారంభంలో నన్ను నమ్మి చాలామంది సినిమాలు రూపొందించారు. క్రమక్రమంగా నన్ను నేను నిరూపించుకుని ఈ స్థాయికి చేరుకున్నా. నేనూ ప్రతిభ ఉన్న వారిని నమ్ముతా. వారి అనుభవం గురించి ఆలోచించను. ప్రాజెక్టు విషయంలో భయపడను.
* నాయికగా నజ్రియాను ఎంపిక చేయాలనే నిర్ణయం ఎవరిది?
నాని: ఈ నిర్ణయం నాదీ వివేక్‌ది. లీల అనే పాత్రకు నజ్రియాను పోలిన కథానాయికలు ఎవరు? అని చర్చించుకున్నాం. ఎంత ప్రయత్నించినా ఎవరూ కనిపించలేదు. నజ్రియానే తీసుకుంటే మంచిదనిపించి ఆమెను సంప్రదించాం. ఎన్నో పెద్ద సినిమాల అవకాశాలను ఒప్పుకోని ఆమె ఈ కథ వినగానే తప్పకుండా చేస్తానని ముందుకొచ్చింది.
* బారిస్టర్ పార్వతీశం నవలకు, ఈ సినిమాకు మధ్య సంబంధం ఉందా?
నాని: ఏమాత్రం సంబంధం లేదు. పంచెకట్టు మాత్రమే సుందర్ పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకున్నాం. సంబంధిత సన్నివేశం మంచి వినోదం పంచుతుంది. కొందరు అనుకుంటున్నట్టు ఈ సినిమా ‘సీతాకోక చిలుక’, ‘మరో చరిత్ర’ను పోలి ఉండదు. చాలా కొత్త కథ ఇది.
* ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి వివరిస్తారా?
నాని: సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ సినిమాకి ప్రధాన బలం. తన సంగీతంతో కథకు ప్రాణం పోశాడు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం అదుర్స్. సినిమాటోగ్రాఫర్ నికేత్ పనితనం ప్రతి సీన్లో స్పష్టంగా కనిపిస్తుంది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నేను నటించిన రెండో చిత్రమిది. నిర్మాతలు నవీన్, రవికి సినిమాలంటే ఓ ప్యాషన్.
* మీది ప్రేమ వివాహం కదా.. ఏవైనా సమస్యలు ఎదురయ్యాయా?
నాని: ఎలాంటి సమస్యలు రాలేదు. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు మా పెళ్లి జరిగింది. నా భార్యది సైంటిస్ట్ ఫ్యామిలీ. నాది సినిమా రంగం కాబట్టి మొదట్లో కాస్త కంగారు పడినా తర్వాత నన్ను నమ్మారు.
* మీరు ఇటీవల సినిమా టికెట్ ధరలు పెంచమని కోరారు. కానీ, ఇప్పుడు నిర్మాతలు తగ్గిస్తున్నారు కదా?
నాని: నేను టికెట్ ధరలు పెంచమని అడిగిన సందర్భం వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. సాధారణ ధరలను బాగా తగ్గించి రూ. 30, రూ. 40 చేయడం వల్ల ఇంత తక్కువ రేట్లతో సినిమాలను ప్రదర్శించడం కష్టమని చెప్పాను. భారీ బడ్జెట్ చిత్రాలకు ధరలు పెంచుకోవచ్చు. అందుకే నేనూ అలాంటి సినిమాల గురించి మాట్లాడలేదు. అయినా నేను ఎక్కువగా పెంచమని చెప్పలేదు. అంతకుముందున్న సాధారణ ధరలనే అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశా.
* పాన్ ఇండియా మార్కెట్‌పై మీ అభిప్రాయం?
నాని: మన సినిమాని మనమే పాన్ ఇండియా అనుకుంటే సరిపోదనేది నా అభిప్రాయం. కంటెంట్‌ను బట్టి ప్రేక్షకులే ఈ మాట చెప్పాలి. ఉదాహరణకు ‘పుష్ప’ చిత్రాన్ని తీసుకుంటే.. అది దక్షిణాది అడవుల్లో సాగే కథ. ఉత్తరాది ప్రాంతానికి సంబంధం లేకపోయినా ప్రేక్షకులంతా ఆదరించారు. అలా ఎవరైనా కథపై దృష్టి పెట్టాలిగానీ పోస్టర్‌పై పాన్ ఇండియా అని రాసుకుంటే సరిపోదు.
* ఫలానా సినిమాలో మీరు నటించి ఉంటే బావుండనిపించిందా?
నాని: సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా విషయంలో అలా అనిపించింది.
* మీ తదుపరి సినిమా ‘దసరా’ గురించి చెప్తారా..?
నాని: 25 శాతం షూటింగ్ పూర్తయింది. పవర్ఫుల్ మాస్ చిత్రమిది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.
* మీ నిర్మాణ సంస్థలో రాబోతున్న సినిమాలు?
నాని: ప్రస్తుతం ‘మీట్ క్యూట్’ అనే సినిమా రూపొందుతోంది. అది నేరుగా ఓటీటీలోకి వస్తుంది. త్వరలోనే సంబంధిత వివరాలు ప్రకటిస్తాం. అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ రానుంది. హిట్ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్