Nani: ఒక్క భాగమే కానీ.. ‘‘దసరా’’ గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన నాని
నాని(Nani) నటిస్తోన్న తాజా చిత్రం ‘‘దసరా’’(Dasara). మార్చి30న విడుదల కానున్న ఈసినిమా గురించి నాని ఆసక్తికర ట్వీట్ చేశాడు.
హైదరాబాద్: నాని(Nani) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘‘దసరా’’ (Dasara). జనవరి 30న టీజర్ విడుదలవ్వనుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందనే వార్త సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. దీనిపై తాజాగా నాని ట్వీట్ చేశాడు.
‘‘ఒకటే భాగం. కానీ, రెండు కంటే ఎక్కువ సినిమాల పవర్ ఇందులో ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సినిమా విశేషాలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మూవీ మార్చి30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత నాని శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా(#nani30) చేయనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో