నాని నటన చూసి ఏడ్చేశా: షాహిద్‌కపూర్‌

నేచురల్‌ స్టార్‌ నాని నటనకు ఫిదా కానివారు ఉంటారా..! ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించిన నాని తన యాక్టింగ్‌తో అందర్నీ కంటతడి పెట్టించాడు. ఈ చిత్రం చూసి నాలుగైదుసార్లు ఏడ్చేశానని బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ అన్నాడు. ఆ సినిమాలో నాని నటన అద్భుతమని కొనియాడాడు.

Published : 24 Jun 2021 01:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని నటనకు ఫిదా కానివారు ఉంటారా..! ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించిన నాని.. తన యాక్టింగ్‌తో అందర్నీ కంటతడి పెట్టించాడు. ఈ చిత్రం చూసి నాలుగైదుసార్లు ఏడ్చేశానని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌కపూర్‌ అన్నాడు. ఆ సినిమాలో నాని నటన అద్భుతమని కొనియాడాడు. షాహిద్‌ ప్రధానపాత్రలో ‘జెర్సీ’కి హిందీ రీమేక్‌ తెరకెక్కుతోంది. ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌సింగ్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన షాహిద్‌ మరోసారి తెలుగు సినిమా రీమేక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో షాహిద్‌ మాట్లాడుతూ.. ‘జెర్సీ’ తనకెంత ప్రత్యేకమో వివరించాడు.

‘‘జెర్సీ’ సినిమా నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న కథ. నా వయస్సు 40 ఏళ్లు.. జీవితంలో ఆలస్యంగా సక్సెస్‌ అందుకోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా చాలా ఆలస్యంగా సక్సెస్‌ అందుకున్నవాడినే. నా మనసుకు బాగా దగ్గరైందీ చిత్రం. ఈ సినిమాలో నాని నటన అద్భుతం. ఆ సినిమాలో నాని యాక్టింగ్‌ చూసి నేను ఏడుపు ఆపుకోలేకపోయాను’’ అని ఈ బాలీవుడ్‌ నటుడు పేర్కొన్నాడు. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. పంకజ్‌ కపూర్‌, మృనాల్‌ ఠాకూర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ మధ్యే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.  ‘జెర్సీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని