Nani: ముహూర్తం కుదిరింది
ఇటీవలే ‘దసరా’ (Dasara) చిత్రాన్ని పూర్తి చేశారు కథానాయకుడు నాని (Nani). ఇప్పుడు తన తదుపరి సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవలే ‘దసరా’ (Dasara) చిత్రాన్ని పూర్తి చేశారు కథానాయకుడు నాని (Nani). ఇప్పుడు తన తదుపరి సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇది నానికి 30వ (Nani 30) సినిమా. శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 31న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతామని తెలియజేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నానికి సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Smyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్