Dasara: భారీ సెట్లో నాని ‘దసరా’ కీలక సన్నివేశాల చిత్రీకరణ

నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దసరా’. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైంది.

Published : 01 Jul 2022 20:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దసరా’. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ నిలిచిపోయిందంటూ ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో రేగిన దుమారాన్ని కొట్టిపడేస్తూ ‘దసరా’ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల ట్విటర్‌లో ఒక ఫన్నీ ఫొటోతో జవాబిచ్చారు. ఈ క్రమంలో ‘దసరా’ తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సుదీర్ఘమైన ఈ షెడ్యూల్‌ కోసం ప్రధాన తారాగణమంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీనికోసం హైదరాబాద్‌ శివార్లలో ఒక భారీసెట్‌ రూపొందించారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నాని, కీర్తి సురేశ్‌లపై ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫిలో ౫౦౦మంది గ్రూప్‌ డ్యాన్సర్లతో ఓ పాట చిత్రీకరించనున్నారు. చివరి షెడ్యూల్‌లో స్టంట్‌ డైరెక్టర్‌ అన్బరీవ్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారు. సముద్రఖని, సాయికుమార్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణా గ్రామీణ నేపథ్యంలో, బొగ్గుగనుల ఇతివృత్తంగా ఈ సినిమా కథ ఉంటుందన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని