Nani: త్రివిక్రమ్‌తో సినిమాపై నాని ఆసక్తికర కామెంట్స్‌

నాని హీరోగా రూపొందిన సినిమా ‘దసరా’ (Dasara).  ఈ చిత్రంలో నాని లుక్‌పై వస్తోన్న కామెంట్స్‌పై  ఆయన స్పందించాడు.

Published : 23 Mar 2023 11:43 IST

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ‘దసరా’. ఈ చిత్రంలో నాని (Nani ) పూర్తి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి నాని లుక్‌పై ఎన్నో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ సినిమాల్లో హీరోల లుక్స్‌తో పోలుస్తున్నారు. తాజాగా దీనిపై నాని స్పందించాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దసరా’ గురించి వివరించాడు. దసరా సినిమాకు ఆ రెండు సినిమాలకు చాలా తేడా ఉందని చెప్పాడు. అలాగే త్రివిక్రమ్‌తో సినిమా పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

‘‘దసరా’ సినిమా పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో  తెరకెక్కింది. నిజ జీవితాలకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఈ కథలోని పాత్రలు మీకు దగ్గరగా ఉన్నట్లు ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో కచ్చితంగా థియేటర్‌ అరుపులతో మారుమోగుతుంది.  ‘దసరా’ సినిమా చూశాక ‘పుష్ప’ (Pushpa), ‘కేజీయఫ్‌’ (KGF) సినిమాలతో పోల్చాలనే ఆలోచన కూడా రాదు ’’ అని చెప్పాడు.

 అలాగే ఈ సినిమా రెండో భాగం ఉండదని నాని మరోసారి స్పష్టం చేశాడు. ‘దసరా’ సినిమా రెండు భాగాల కంటెంట్‌ను ఒకే భాగంలో చూస్తారని అన్నారు. అలాగే త్రివిక్రమ్‌తో సినిమా గురించి నాని మాట్లాడుతూ..‘‘ త్రివిక్రమ్‌ నా కోసం స్క్రీప్ట్‌ రాయాలని చెప్పారు. ఒకవేళ ఆయనతో నేను సినిమా తీస్తే అది నా జీవితంలో కచ్చితంగా ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నాడు.  ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. నాని సరసన కీర్తి సురేష్‌ (Keerthy Suresh) నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని