Nani: అప్పుడు వాళ్లు నన్ను భయపెట్టారు.. : నాని
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్-2’ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి.
హైదరాబాద్: ‘హిట్-2’తో (HIT2) నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై అంతటా మంచి టాక్ అందుకుంది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన సమయంలో తనని ఎంతోమంది భయపెట్టారని అన్నారు.
‘‘నటుడిగా నేను వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వాల్ పోస్టర్ సినిమా టీమ్ కష్టపడి పనిచేయడం వల్లే ఈ సినిమా సాఫీగా పూర్తైంది. ‘హిట్-2’ కోసం పనిచేసిన నటీనటులు, ఇతర టెక్నికల్ బృందానికి ధన్యవాదాలు. శేష్.. కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ హిట్ కావడానికి కారణమదే. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలి, విభిన్న చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మొదలు పెట్టినప్పుడు.. ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు?, ఇలాంటివి చేస్తే వర్కౌట్ అవుతుందా? అని ఎంతోమంది నన్ను భయపెట్టారు. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయట్లేదు.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకంతోనే చేస్తున్నా. అది మరోసారి నిరూపితమైంది’’ అని నాని అన్నారు.
దాదాపు ఏడు విభిన్నమైన కథలతో హిట్ వర్స్‌ను సృష్టిస్తున్నారు దర్శకుడు శైలేశ్ కొలను. మొదటి కథకు విశ్వక్‌సేన్‌ను హీరోగా ఎంచుకున్న ఆయన ఇప్పుడు ‘హిట్-2’లో అడివి శేష్‌ను పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో చూపించారు. విశాఖపట్నంలో జరిగిన యువతుల హత్య కేసు నేపథ్యంలో ఈచిత్రాన్నితెరకెక్కించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని దీన్ని నిర్మించారు. ‘హిట్-3’లో నాని కథానాయకుడిగా కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..
-
Crime News
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే!
-
General News
Bhadrachalam: రాములోరి పెళ్లికి ఖమ్మం గోటి తలంబ్రాలు