
Nani: ఆది పెళ్లిలో నాని, సందీప్ స్టెప్పులు.. వీడియో వైరల్
హైదరాబాద్: నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగుతోంది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఈరోజు సాయంత్రం మూడుముళ్లు వేయనున్నారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన నాని, సందీప్ కిషన్ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆది-నిక్కీలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్ నా కక్కా’ (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక, ‘ఒక విచిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాలతో ఆది తెలుగువారికి సుపరిచితులయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Ease of doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలు టాప్
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Politics News
Maharashtra Crisis: ఫడణవీస్ ప్రమాణ స్వీకారం రేపేనా..? శిందే వర్గం ఏ చెప్పిందంటే..?
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
-
India News
ఈ సీఎంలు.. బల ‘పరీక్ష’ ముందే తప్పుకున్నారు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?