అభిమానులు క్షమించండి: ‘నారప్ప’ నిర్మాత

తన చిత్రం ‘నారప్ప’ ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తున్నందుకు టాలీవుడ్‌ కథానాయకుడు అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్ర నిర్మాత కలైపులై థాను  కూడా అభిమానులను క్షమాపణలు కోరారు. ‘దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెంకటేశ్‌గారు తమిళ సినిమా రీమేక్‌ చేస్తున్నారు.

Published : 20 Jul 2021 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన చిత్రం ‘నారప్ప’ ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తున్నందుకు టాలీవుడ్‌ కథానాయకుడు అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్ర నిర్మాత కలైపులై థాను కూడా అభిమానులను క్షమాపణలు కోరారు. ‘‘దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెంకటేశ్‌ తమిళ సినిమా రీమేక్‌ చేస్తున్నారు. ‘నారప్ప’లో ఆయన అద్భుతంగా నటించారు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడం పట్ల చాలామంది అభిమానులు నిరాశకు గురయ్యారన్న విషయాన్ని నేను కూడా ఒప్పుకొంటున్నా. ఓటీటీలో విడుదలపై స్పష్టత ఇవ్వదలచుకుంటున్నా. నిజానికి సురేశ్‌బాబుగారికి ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఓటీటీలో విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. కానీ.. నేను ఆయనపై ఒత్తిడి తేవాల్సి వచ్చింది. ఎందుకంటే మే 14న సినిమా విడుదల చేస్తామని మేం తొలుత ప్రకటించాం. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల అది కుదరలేదు. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాగోలా సినిమాను విడుదల చేయాలని సురేశ్‌బాబుగారిని నేను ఒప్పించాల్సి వచ్చింది. అభిమానులను క్షమాపణలు కోరుతున్నా. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా నేను కూడా సినిమాను థియేటర్లోనే చూడాలని కోరుకుంటా. కానీ అనివార్యమైన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా సినిమాను ఇంట్లోనే ఉంటూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను’’ అని థాను అన్నారు.

తమిళం సూపర్‌హిట్‌ చిత్రం ‘అసురన్‌’కు రీమేక్‌గా ఈ ‘నారప్ప‘ తెరకెక్కింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్‌ సరసన ప్రియమణి కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 20న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని