Naresh: ‘నరేశ్‌ 59’.. మొదలైంది

అల్లరి నరేశ్‌ సినిమా అవకాశాల విషయంలో ఎప్పుడూ జోరు ప్రదర్శిస్తుంటారు. అలా అనతికాలంలోనే ఆయన హీరోగా 58 చిత్రాల్ని పూర్తి చేశారు.

Published : 01 Feb 2022 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి నరేశ్‌ కొత్త సినిమాల విషయంలో ఎప్పుడూ జోరు ప్రదర్శిస్తుంటారు. అలా అనతికాలంలోనే హీరోగా 57 చిత్రాల్ని పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘సభకు నమస్కారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘నరేశ్‌ 59’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి రాజ్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది కథానాయిక. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జ్యోతిష్యుడు బాలు మున్నంగి క్లాప్‌కొట్టారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి, కళ: బ్రహ్మ కడలి. ఈ సినిమా టైటిల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని