Naresh: ముదిరిన నరేశ్‌ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య

సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh) కుటుంబ వివాదం మరింత ముదిరింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌-పవిత్రా లోకేశ్‌(Pavitra Lokesh) కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న నటుడి భార్య రమ్య అక్కడికి చేరుకుని...

Published : 04 Jul 2022 01:38 IST

బెంగళూరు‌: సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh) కుటుంబ వివాదం మరింత ముదిరింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌-పవిత్రా లోకేశ్‌(Pavitra Lokesh) కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న నటుడి భార్య రమ్య అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ గొడవ చేశారు. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఈ మొత్తం తతంగంతో నరేశ్‌, పవిత్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అసలేం జరిగిందంటే..

నరేశ్‌, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటి పవిత్రా లోకేశ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. నరేశ్‌-పవిత్ర పెళ్లి చేసుకోనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వాటిపై రమ్య స్పందిస్తూ.. ‘‘నాకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారు. ఇది చట్టరీత్యా నేరం’’ అని వరుస ప్రెస్‌మీట్లలో హెచ్చరించింది. రమ్య చేస్తోన్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని.. డబ్బు కోసం ఆమె తమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందని.. తమ మధ్య మంచి అనుబంధం ఉందని.. నరేశ్‌, పవిత్ర ఇటీవల వివరణ ఇచ్చారు. రమ్యకు విడాకుల నోటీసులు పంపిన విషయాన్నీ నరేశ్‌ వెల్లడించారు. గత వారం రోజుల నుంచి నరేశ్‌ కుటుంబ వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారగా.. తాజాగా జరిగిన ఘటనతో ఇది మరింత ముదిరినట్లు తెలుస్తోంది.

రమ్య ఆరోపణలపై ఇటీవల నరేశ్‌, పవిత్ర ఏమన్నారంటే..! 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని